24, ఏప్రిల్ 2009, శుక్రవారం

ఒక రాజు-ఒక రాణి

ఒక రాజు-ఒక రాణి

కరిగి పోయిన శిలగా నేనున్నాను
చేరిగిపోనీ స్వప్నం ల నీ గుండెలో

విషాద గీతమై నేనున్నాను
శ్రావ్యమైన కవితల నీ హృదయం లో

నిశిత వేల విలపిస్తూ నేనున్నాను
ఉదాయ భానుని సంధ్యాల నీ ఉహాల్లో


నా కావ్య కళలకు నువ్వే రాజువి
నీ ఉహాల జగతికీ నేనే రాణిని

31, మార్చి 2009, మంగళవారం

"నాకిష్టం"

ఉదయిస్తున్న సూర్యుడు "నాకిష్టం"
కనిపించని దేవుడు "నాకిష్టం"

పక్షుల కీల కీలలు "నాకిష్టం"
కోకిల కూహు కుహులు "నాకిష్టం"

మంచు బిందువులు "నాకిష్టం"
సెలయేటి రాగాలు "నాకిష్టం"

పాపాయి మూసి మూసి నవ్వులు "నాకిష్టం"
కమ్మని గీతాలు "నాకిష్టం"

అమ్మ చేసిన పులిహోర "నాకిష్టం"
నాన్న ఇచ్చిన పాకెట్ మనీ "నాకిష్టం"

నా స్నేహితులు "నాకిష్టం"
నా కళాశాల "నాకిష్టం"

అస్తమిస్తున్న సూర్యుడిని చూడడం (ఎంతో ఇష్టం) "నాకిష్టం"
ఈ ప్రకృతి సోయాగలు "నాకిష్టం"

చీకటి వేళ నక్షిత్రాలు "నాకిష్టం"
పున్నామి వెన్నెలలో చంద్రుడు "నాకిష్టం"

తియ్యని కళలు, చక్కని నిద్ర "నాకిష్టం"
మళ్లీ రేపటి సుర్యోదయం కోసం ఎదురు చూడడం "నాకిష్టం"

30, జనవరి 2009, శుక్రవారం

నా నీవే....

నా ప్రతి శ్వాస నీవే....
నా ప్రతి ఆశ నీవే....
నా ప్రతి దృశ్యం నీవే....
నా ప్రతి స్వప్నం నీవే....
నా ప్రత అడుగు నీవే....
నా ప్రతి కదలికా నీవే....
నా ప్రతి నిత్యం నీవే....
నా ప్రతి సత్యం నీవే....
నా ప్రతి మొదలు నీవే..
నా ప్రతి గమ్యం నీవే....
నా ప్రతి క్షణం నీవే....
నా అణు క్షణం నీవే....


నా నిన్న నీవే.. నా రేపు నీవే..
నా కల నీవే.. నా నిజం నీవే..
నా వెలుగు నీవే..నా చీకటి నీవే..
నా నీడ నీవే.. నా తోడు నీవే..
నీది కాని నేను నేను కాదు..........

నీతో గడిపిన మధుర క్షణాలుఎన్నెన్నో..
ఒక్క క్షణం చాలు.. ఈప్రాణానికి...
ఎన్ని జన్మలైన స్మరించుకోడానికి...

ఒకే ఒక్క మాట
ఇంకేం చెప్ప లేను
నీవు లేని నేను లేను............

28, జనవరి 2009, బుధవారం

నా చిట్టి కవితలు

1. అలల 'ప్రయాణం' తీరం "వరకు"
కలల 'ప్రయాణం' మెలకువ "వరకు"
ప్రేమ 'ప్రయాణం' పెళ్ళి "వరకు"
స్నేహ 'ప్రయాణం' నా మరణం "వరకు"

2. గాలివీస్తే ఆరేది దీపం
రోజు గడిస్తే వాడిపోయేది పుష్పం
మెలకువ వస్తే చెదిరేది స్వప్నం
ప్రళయం వచ్చినా చెరగనిది స్నేహం !

3. కురిసే వానకి తెలియదు అది 'వరద"అని
మెరిసే మెరుపుకి తెలియదు అది 'పిడుగు"అని
ఎగసే అలకి తెలియదు అది'సునామీ" అని
నా చిట్టి మనసుకి తెలియదు ఇది 'కవిత" అని.

11, జనవరి 2009, ఆదివారం

కొత్త దిశ లో నా పయనం .........

బ్లాగులోకంలోకి నా తొలి అడుగు పెట్టి తుళ్ళింతలతో పరవశిస్తున్న బుజ్జాయిని.
మనసులోని మాటలు మనసారా పంచుకుంటూ .............
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ అందరినీ నవ్వించుకుంటూ..........
కేరింతలు కొట్టాలన్న నా తాపత్రయం చూసి ఉప్పొంగిన నా ముద్దుల అక్క ....
చెయ్యిపట్టించి చిట్టి పాపాయికి ఓనమాలు నేర్పించినట్లు నాతో బ్లాగించి........
మురిసిపోతోంటే.....మైమరచిపోతోంటే......
అడుగులో అడుగేసి, నా నడకను సరిచూసుకుంటూ .....
నా అనుకున్న వాళ్ళను నడిపించుకుంటూ సాగాలని ముందడుగు వేస్తున్నాను......................................
శుభారంభం !