28, జనవరి 2009, బుధవారం

నా చిట్టి కవితలు

1. అలల 'ప్రయాణం' తీరం "వరకు"
కలల 'ప్రయాణం' మెలకువ "వరకు"
ప్రేమ 'ప్రయాణం' పెళ్ళి "వరకు"
స్నేహ 'ప్రయాణం' నా మరణం "వరకు"

2. గాలివీస్తే ఆరేది దీపం
రోజు గడిస్తే వాడిపోయేది పుష్పం
మెలకువ వస్తే చెదిరేది స్వప్నం
ప్రళయం వచ్చినా చెరగనిది స్నేహం !

3. కురిసే వానకి తెలియదు అది 'వరద"అని
మెరిసే మెరుపుకి తెలియదు అది 'పిడుగు"అని
ఎగసే అలకి తెలియదు అది'సునామీ" అని
నా చిట్టి మనసుకి తెలియదు ఇది 'కవిత" అని.

3 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. కలల ప్రయాణం మెలకువ వరకు--- ఈ మాట చాలా బాగుంది. మీ అక్కయ్యలా మీరు కూడా బాగా రాయండి. బ్లాగ్ లోకానికి స్వాగతం. ఇక విజృంభించండి.

    --సతీష్ యనమండ్ర

    రిప్లయితొలగించండి